పాల వ్యాపారం కోసం హెలికాఫ్టర్ కొన్న రైతు

145

పాల వ్యాపారం అంటే బైక్ పైనో, లేదంటే ఆటోలోనో చేస్తారు.. మరి ఎక్కువగా పాలు ఉంటే ఓ డీసీఎం వ్యాన్ కొంటారు. కానీ ఓ పాలవ్యాపారి మాత్రం హెలికాప్టర్ కొనుగోలు చేశాడు.. దీని ధర రూ.30 కోట్లు. మహారాష్ట్ర భివాండికి చెందిన జనార్ధన్‌ భోయిర్ అనే రైతు, ఈ మధ్య పాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు గాను పలు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు. అయితే అతడు వెళ్లే దగ్గరకు విమాన సర్వీసులు లేకపోవడం.. అతడు వెళ్లాల్సిన ప్రదేశానికి కార్లు, బస్సులపై వెళ్తుంటే సమయం వృధా అవుతుండటంతో ఏకంగా హెలికాప్టర్ కొనేసాడు. ప్రస్తుతం హెలికాప్టర్ పైనే వివిధ రాష్ట్రాలు తిరుగుతున్నారు జనార్దన్. ఆయనను చూసి ఇతర రైతులు ఆశ్చర్య పోతున్నారు.

పాల వ్యాపారం కోసం హెలికాఫ్టర్ కొన్న రైతు