కోహ్లీ పోలికలతో మరో వ్యక్తి

98

కోహ్లీ పోలికలతో మరో వ్యక్తి

భారత్ జట్టు వన్డే, టి20, టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే.. కాగా వన్ డే, టి20 సిరీస్ లు ముగిసాయి. వన్డే ట్రోఫీ ఆస్ట్రేలియా సొంతం చేసుకోగా, టి20 సిరీస్ ను భారత్ గెలుచుకుంది. మంగళవారం జరిగిన చివరి టి20లో అచ్చం విరాట్ కోహ్లీలా ఉన్న ఇండియన్ అభిమాని స్టేడియంలోకి వచ్చాడు. మ్యాచ్ లో ఏడో ఓవర్ నడుస్తుండగా ఒక్కసారిగా స్క్రీన్ లో కనిపించాడు.

 

అచ్చం కోహ్లీలా ఉన్న వ్యక్తిని చూసి అభిమానులు బిత్తరపోయారు. అనంతరం కోహ్లీ, కోహ్లీ అంటూ నినాదాలు చేశారు. అయితే భూమిపై ఒకే విధమైన పోలికలతో ఏడుగురు ఉంటారన్న విషయం తెలిసిందే.