న్యూ ఇయర్ రోజు అభిమాని సర్ప్రైజ్, బాగోదన్న “రోహిత్ శర్మ”

1295

భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. సమయం దొరికినప్పుడు ఆస్ట్రేలియాని చుట్టొస్తున్నారు. కొత్త ఏడాది సందర్బంగా ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ భోజనం చేసిన తర్వాత బిల్ అడిగారు. అయితే అప్పటికే ఓ వ్యక్తి వారి బిల్ చెల్లించినట్లుగా చెప్పాడు బేరర్. మీ టేబుల్ వెనక కూర్చున్న నవల్ దీప్ సింగ్ అనే వ్యక్తి బిల్ పే చేసినట్లు హోటల్ సిబ్బంది మన క్రికెటర్లకు తెలిపారు. దింతో మన క్రికెటర్లు సర్ప్రైస్ అయ్యారు. ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో, బిల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే భారత్ కు చెందిన నవల్ దీప్ సింగ్ మెల్ బోర్న్ లో ఉంటున్నారు. జనవరి 1 సందర్బంగా ఆయన ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. అతడి టేబుల్ ముందు భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, నవదీప్ సైని, శుభ్ మన్ గిల్ కూర్చుని ఉన్నారు. వారిని చూసి నవల్ దీప్ ఆశ్చర్యపోయారు. తనకు వచ్చిందని అనుకున్నాడు.. ఈ మధురానుభూతి చిరకాలం గుర్తుండాలి అంటే తాను బిల్ కట్టాలని నిశ్చయించుకున్నాడు. దింతో వారు తినే వరకు ఉండి బిల్ పే చేశాడు.

ఈ విషయాన్నీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. “నేను బిల్లు చెల్లించినట్లు వాళ్లకు తెలియదు, నా సూపర్ స్టార్స్ కోసం ఇంతమంత్రం చెయ్యలేనా! అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక బిల్లు కట్టిన విషయం తెలుసుకున్న రోహిత్ బ్రదర్ డబ్బులు తీసుకో మీరు చెల్లించడం బాగోదు అని అన్నాడు. ఆ తర్వాత పంత్ హాగ్ చేసుకొని అందరు కలిసి ఫోటో దిగినట్లు నవల్ దీప్ సింగ్ పేర్కొన్నారు.

న్యూ ఇయర్ రోజు అభిమాని సర్ప్రైజ్, బాగోదన్న “రోహిత్ శర్మ”