ప్రముఖ గాయకుడు మృతి.. ప్రధాని సంతాపం

160

ప్రముఖ గాయకుడు నరేంద్ర చంచల్ కన్నుమూశారు. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంచల్ గత కొంత కాలంగా ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూన్నారు. శుక్రవారం ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విధించారు. చంచల్ అక్టోబర్ 16 1940 లో పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. ఆధ్యాత్మిక పాటలతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. హిందీలో అనేక పాటలు పాడారు. పలు చిత్రాల్లో కూడా పాటలు పదారు చంచల్. బాబీ సినిమాలో Beshak Mandir Masjid Todo పాటకు గాను 1977 లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు.

ఇక చంచల్ మరణం పట్ల ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. తనమధురమైన గాత్రంతో ఆధ్యాత్మిక ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా నరేంద్ర చంచల్‌కు నివాళులు అర్పించారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నరేంద్ర చంచల్ మృతికి నివాళి అర్పించారు. సినీ ప్రముఖులు, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆయనను స్మరించుకుంటూ ట్విటర్‌ వేదికగా సంతాపం ప్రకటించింది.

ప్రముఖ గాయకుడు మృతి