ప్రముఖ కళాకారుడు జన్నలగడ్డ మృతి

158

కలంకారీ కళాకారుడు, పద్మశ్రీ అవార్ద్ గ్రహీత జన్నలగడ్డ గుర్రప్పశెట్టి (75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా ఇయ్యనకు 2008 పద్మశ్రీ అవార్డు వచ్చింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జన్నలగడ్డకు అనేక అవార్డులు వచ్చాయి. శ్రీకాళహస్తి ప్రాంతంలో కలంకారీ వృత్తిని మెరుగుపరిచి చాలామందికి శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయి కలంకారీ కళాకారులుగా తీర్చి దిద్దారు. ఎందరికో ఆదర్శంగా నిలిచి కలంకారీ వృత్తిని నమ్ముకొని అంచలంచలుగా ఎదిగిన జన్నలగడ్డ మృతి ఆ ప్రాంత వాసులను దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇక ఈయన మృతిపై సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. కలంకారీ వృత్తికి వన్నెతెచ్చిన జొన్నలగడ్డ కన్నుమూయడం బాధగా ఉందని అన్నారు.

ప్రముఖ కళాకారుడు జన్నలగడ్డ మృతి