ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

86

వడ్డీ వ్యాపారి ఆగడాలకు ఓ కుటుంబం బలైంది. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లా పుదుపాలెం గ్రామంలో చోటుచేసుకుంది. కాగా వడ్డీ వ్యాపారి దగ్గర కొత్త మొత్తం తీసుకున్నారు. వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోవడంతో వడ్డీ చెల్లించలేకపోయారు. అసలు వడ్డీ పెరిగిపోతుండటంతో వడ్డీ వ్యాపారి డబ్బు చెల్లించాలని వేధించాడు.

దింతో మనస్తాపానికి గురై ముగ్గురు పిల్లలకు విషమించి భార్య భర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇక వడ్డీ వ్యాపారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య