భూమా అఖిల ప్రియా అరెస్ట్

1147

కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి టీడీపీ నేత భూమా అఖిల ప్రియా, ఆమె భర్త భార్గవ రామ్ ను బోయిన్ పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్ పల్లిలో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి సమయంలో ప్రవీణ్ రావుతో పాటు అతడి సోదరులను కిడ్నాప్ చేశారు కొందరు వ్యక్తులు.

వారిలో అఖిల ప్రియా మరిది ఉన్నట్లుగా సమాచారం. అయితే కిడ్నాప్ కి గురైన ముగ్గురిని పోలీసులు రక్షించారు. ఈ కేసులో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, రెండు కార్లను సీజ్ చేశారు మరో కారు కోసం వెతుకుతున్నారు. కాగా 50 ఎకరాల భూ వివాదం విషయంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తుంది. దీని విలువ 600 కోట్ల రూపాయలవరకు ఉంటుందని సమాచారం