మాజీ కౌన్సిలర్ దారుణ హత్య

142

జనగామ జిల్లాలో దారుణం జరిగింది. జాగింగ్ కి వెళ్లిన మాజీ కౌన్సిలర్ ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి పారిపోయారు. ఈ ఘటనలో సదరు కౌన్సిలర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి పేరు పులిస్వామిగా తెలుస్తుంది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

హత్యపై పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జాగింగ్ కి వచ్చిన సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై దాడి చేసి హత్యచేసినట్లు చెబుతున్నారు. అనంతరం అక్కడినుంచి ఇద్దరు వ్యక్తులు పారిపోయారని తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భూ వివాదమే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

మాజీ కౌన్సిలర్ దారుణ హత్య