Pm Modi News : మోడీని చంపేస్తాం అంటు బీజేపీ ఎమ్మెల్యేకు సందేశం

195

ప్రధాని నరేంద్ర మోడీతోపాటు మరికొందరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలను చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు యూపీలోని ఎటావా సదర్ ఎమ్మెల్యే సరితా భదౌరియా సందేశాలు పంపారు. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు 8 సందేశాలు పంపారు. ఇందులో ప్రధాని మోడీతోపాటు ఎమ్మెల్యే సరితా భదౌరియాను కూడా హత్య చేస్తామని బెదిరించినట్లుగా ఆమె ఎటావా సదర్ పోలీసులకు తెలిపారు. దింతో వారు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

సందేశాల్లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ఎస్‌ఐఎస్ లోగో ఉన్నట్లుగా తెలిపారు సరితా భదౌరియా. నెంబర్ కూడా +92 పాకిస్థాన్ కోడ్ తో ప్రారంభమైనట్లు తెలిపారు. ఈ విషయంపై ఎటావా సదర్ పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ ఆ సందేశాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నట్లు చెప్పారు. కాగా 1999లో భర్త అభయ్ వీర్ సింగ్ భదౌరియా హత్యానంతరం సరితా భదౌరియా రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజల కోసం తాను పోరాటం కొనసాగిస్తానని, బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు.

Pm Modi News : మోడీని చంపేస్తాం అంటు బీజేపీ ఎమ్మెల్యేకు సందేశం