కరోనాతో కన్నుమూసిన ఎస్వాతిని ప్రధాన మంత్రి

139

ఆఫ్రికా ఖండంలో చిన్న దేశమైన ఎస్వాతిని ప్రధాని ఆంబ్రోస్ మాండ్వలో లామిని కరోనాతో కన్నుమూశారు. నవంబర్ రెండో వారంలో లామినికి కరోనా సోకింది దింతో ఆయను లోభంబలోని ఆసుపత్రికి చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు.

2018 లో ఆంబ్రోస్ మాండ్వలో లామిని, ఎస్వాతిని ప్రధానిగా ఎన్నికయ్యారు. అంతకు ముందు ఆయన 18 ఏళ్ళు బ్యాంకింగ్ రంగంలో పనిచేశారు. ప్రధాని మృతి చెందిన విషయాన్నీ ఉపప్రధాని తెబా మసూకూ అధికారికంగా వెల్లడించారు. దేశ ప్రధాని కరోనాతో పోరాడుతూ మృతి చెందారని తెలిపారు. 12 లక్షల జనాభా ఉన్న ఎస్వాతినిలో 6768 మందికి కరోనా సోకగా 127 మంది చనిపోయారు.

కరోనాతో కన్నుమూసిన ఎస్వాతిని ప్రధాని