బీజేపీలోకి ఎర్రబెల్లి

492

బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో విజయం తర్వాత నేతల చూపు బీజేపీపై పడింది. కాంగ్రెస్ తోపాటు, టీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలు బీజేపీ వైపు చేస్తున్నారు. శనివారం కరీంగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత రమేష్ రాజీనామా చేయగా ఇక, వరంగల్ జిల్లాకు చెందిన మరో నేత బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.

పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ఇయ్యన వరంగల్ తూర్పు నియోజకవర్గంపై కన్నేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రదీప్ రావు పార్టీ మారడంపై టీఆర్ఎస్ నేతలు స్పందించారు.. తాను పార్టీ మారడం వల్ల ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కాగా బీజేపీ శ్రేణుల్లో ఇయ్యన చేరికపై వ్యతిరేకత కనిపిస్తుంది. ఎర్రబెల్లి తన తమ్ముడిని బీజేపీలోకి పంపుతున్నారని వరంగల్ బీజేపీలో చర్చ నడుస్తుంది.

బీజేపీలోకి ఎర్రబెల్లి