షర్మిల పార్టీపై కేటీఆర్, ఎర్రబెల్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

705

దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిలరెడ్డి తెలంగాణలో పార్టీ పెట్టేందుకు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె నల్గొండ జిల్లా నేతలతో భేటీ అయ్యారు, ఇక ఈ నెల 21 న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అయితే షర్మిల పార్టీలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు ఆమెను స్వాగతిస్తుంటే మరికొందరు విమర్శలు చేస్తున్నారు. వైఎస్ఆర్ అభిమానులు, తాజా మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు షర్మిల పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నారు. ఆమె వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణకు చెందిన మరికొందరు నేతలు ఆమె పార్టీ పెట్టాడని వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఆంధ్ర పార్టీలను నమ్మరని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ ఆంధ్ర పార్టీ అని ముద్ర పడటంతో దుకాణం సర్దాల్సి వచ్చిందని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే కొత్తపార్టీని ఉద్దేశించి శుక్రవారం కేటీఆర్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డమీద పుట్టి నిలదొక్కుకున్న పార్టీలు రెండే రెండని.. అందులో ఒకటి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం కాగా మరొకటి కేటీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ అని అన్నారు.

ఇక ఇదే విషయమై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. తెలంగాణ ప్రజలు ఆంద్ర పార్టీలను స్వాగతించలేదని, తెలంగాణలో టీడీపీ ప్రస్తుత పరిస్థితికి ఇదే కారణం అని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే చాలా పార్టీలు వచ్చాయని, కానీ సక్సెస్ కాలేదని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

షర్మిల పార్టీపై కేటీఆర్, ఎర్రబెల్లీ ఆసక్తికర వ్యాఖ్యలు