సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం

176

జమ్మూకాశ్మీర్ శ్రీనగర్ లోని బుద్గాంలో భద్రతాబలగాలకు, టెర్రరిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు ముష్కరులు మృతి చెందగా, ఓ పోలీస్ అధికారి వీరమరణం చెందారు. కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుద్గాం ప్రాంతంలో ఉగ్రవాదాలు ఉన్నారని అందిన సమాచారం మేరకు.. స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. భద్రతా బలగాలను గమనించిన టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు.. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది ముష్కరులపై బుల్లెట్ల వర్షం కురిపించారు.

ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు ముష్కరులు మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన ఎస్పీఓ మహ్మద్‌ అల్తాఫ్‌ మృతి చెందగా.. మరో పోలీస్ అధికారి అహ్మద్ గాయపడ్డారు. ప్రస్తుతం బుద్గాంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి షోపియాన్‌ ప్రాంతంలోనూ మరో ఎన్‌కౌంటర్‌ జరిగిందని, ఆయా ఘటనలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.

సరిహద్దుల్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం