ఎన్నికల నోటిఫికేషన్ .. సెలవుపై వెళ్లిన కలెక్టర్..

62

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ vs ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంది. ప్రభుత్వం ఎన్నికలు జరపలేమని తెగేసి చెబుతుంటే, ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికలు జరిపి తీరాలని మొండిపట్టు పట్టింది. దింతో ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య వైరం పెరిగి దూరం ఏర్పడింది. ఇక హైకోర్టు తీర్పు అనుగుణంగానే పంచాయితీ ఎన్నికలకు వెళ్తున్నామని ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ చెబుతన్నారు. ప్రభుత్వం కరోనా వాక్సిన్ వంకచూపుతూ తాము నిర్వహించలేమని చెబుతుంది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉంటే, హైకోర్టు తీర్పును ఆధారంగా చేసుకొని మొదటివిడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు నిమ్మగడ్డ. జనవరి 25 నుంచి నామినేషన్స్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ సెలవులపై వెళ్లినట్లు తెలుస్తుంది. 23, 24 , 25 తేదీల్లో ఆయనకు విధులకు హాజరు కారని కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. అనారోగ్య కారణాలవల్లనే కలెక్టర్ సెలవులపై వెళ్లినట్టు తెలిపారు కలెక్టరేట్ సిబ్బంది. కాగా దీనిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు కార్యాలయంలో ఉన్న కలెక్టర్ సడన్ గా శనివారం సెలవు పెట్టడం ఎన్నికల ఎఫెక్ట్ అని అంటున్నారు.

అయితే జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎన్నికల ప్రధాన అధికారిగా ఉంటారు. జిల్లాలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లని కలెక్టర్ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. అయితే జిల్లా కలెక్టరే లేకపోతే ఎలా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇక మరోవైపు గుంటూరు కలెక్టర్, చిత్తూరు ఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తప్పించారు ఎస్ఈసీ. వీరితోపాటు మరో ఏడుగురిని ఎన్నికల విధులనుంచి తప్పించారు.

ఎన్నికల నోటిఫికేషన్ .. సెలవుపై వెళ్లిన కలెక్టర్..