ఏపీలో మరో ఎన్నికల నోటిఫికేషన్..?

70

ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఎన్నికకు నోటిఫికేషన్ రానున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక నిమ్మగడ్డ దూకుడు చూస్తుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. పంచాయితీ ఎన్నికల్లోనే ప్రభుత్వానికి ఎస్ఈసికి మధ్య ఫైట్ జరుగుతుంది. మళ్ళి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్ధం కావడం లేదు. రేషన్ పంపిణి వాహనాలకు రంగులు మార్చాలని నిమ్మగడ్డ ఆదేశించిన విషయం తెలిసిందే.. అయితే ఈ ఆదేశాలు మరో ఎన్నికను దృష్టిలో ఉంచుకొని ఇచ్చినట్లుగా అర్ధమవుతుంది. రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నందున రంగులు మార్చిన వాహనాల్లోనే రేషన్ డోర్ డెలివరీ చేయాలని ఆదేశించారు.

అయితే పంచాయితీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. మునిసిపల్ ఎన్నికలపై కూడా నిమ్మగడ్డ దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. మార్చి 31 లోపు రాష్ట్రంలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి, వెళ్లిపోవాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు నిమ్మగడ్డ.. ఈ నేపథ్యంలోనే ఊహించని నిర్ణయాలతో చకచకా అడుగులు వేస్తున్నారు. కాగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతేడాది మార్ఛిలోనే పూర్తి కావాల్సి ఉంది. ఐతే కరోనా కారణంగా నిమ్మగడ్డ వీటిని వాయిదా వేశారు. ప్రభుత్వానికి చెప్పకుండా వాయిదా వెయ్యడంతో, నిమ్మగడ్డ vs అధికారపార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే తనకు ఉన్న ప్రత్యేక అధికారాలతోనే తాను ఎన్నికలను వాయిదా వేసినట్లుగా చెప్పుకున్నారు నిమ్మగడ్డ.

ఇక పంచాయితీ ఎన్నికల విషయంలో కూడా పెద్ద రచ్చే జరిగింది. ప్రభుత్వం ఎన్నికలు జరపమని మంకు పట్టు పట్టింది. దింతో కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పుతో ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతుంది. ఫిబ్రవరి 21తో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఫిబ్రవరి 22 న మునిసిపల్, కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కానీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు మానసికంగా సిద్ధమయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో అమలు చేస్తున్న వ్యూహాలను జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైన నేపథ్యంలో నేరుగా బరిలో దిగాలని చూస్తున్నాయి. మరి మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

ఏపీలో మరో ఎన్నికల నోటిఫికేషన్..?