Election Commission: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు.. నేడే షెడ్యూల్!

153

Election Commission: మరోమారు దేశంలో ఎన్నికల హడావుడి మొదలుకానుంది. ఒకేసారి ఐదు రాష్ట్రాలలో ఎన్నికలకు నగారా మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్‌ జారీ చేయనున్నట్లు తెలుస్తుండగా సాయంత్రం 4.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి ప్రకటించనున్నారు. పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉండగా ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించి ఎన్నికల నిర్వహణపై అధికారులు, రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించింది.

ఆ ఐదు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం, ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికకు సైతం షెడ్యూల్‌ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ లో గత ఎన్నికల్లో పోటీ టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన నోముల నర్సింహయ్య మరణించడంతో ఖాళీగా ఉండగా.. తిరుపతి పార్లమెంట్‌ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందిన దుర్గా ప్రసాద్‌ గతేడాది సెప్టెంబర్‌లో కరోనా బారినపడి మృతి చెందడంతో ఖాళీ అయ్యింది. ఐదు రాష్ట్రాలతో పాటు ఈ రెండు స్థానాలకు సైతం షెడ్యూల్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు.. నేడే షెడ్యూల్!