కేసీఆర్ పై ఈడీ దాడులు

274

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఈడీ దాడులు చేసే అవకాశం ఉందని సీఎం కోటరీ చుట్టూ రైడ్స్‌ జరగొచ్చని బీజేపీ నేత కపిలవాయి దిలీప్‌కుమార్ అన్నారు. శుక్రవారం తన ఎమ్మెల్సీగా తన నామినేషన్ ఉపసంహరించుకున్న నేపథ్యంలో GHMC ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అతడిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయనుందని తెలిపారు. అనిల్ అంబానీకి కంటే కేసీఆర్ సంపాదనే అధికమని అన్నారు. ఆ జాబితా అంతా ఈడీ దగ్గర ఉందని తెలిపారు.

కేసీఆర్‌ కుటిల రాజకీయవేత్త అని విమర్శించారు. మాజీ ప్రధాని పీవీపై కేసీఆర్‌కు ఏనాడూ ప్రేమ లేదని, వాణిదేవిని బలిపశువును చేయడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నారని అన్నారు. కేసీఆర్ మాయమాటలు పట్టభద్రులు నమ్మొద్దని దిలీప్ కుమార్ తెలిపారు. త్వరలో కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుందని వివరించారు. అయితే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కూడా కేసీఆర్ పై ఓ సంచలన విషయం బయటపెడతా అని శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో తెలిపారు. అది ఇదేనేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ పై ఈడీ దాడులు