తూర్పుగోదావరి జిల్లాలో వింత జంతువు

96

అప్పుడప్పుడు మనకు వింత జంతువులు దర్శనమిస్తాయి. అవి భూమి మీద ఉండేవే కానీ ఎప్పుడు మనం చూడని ఓ జీవి మనకు కనిపిస్తే వింత విజి అని పేరు పెట్టేస్తాం. ఇప్పుడు అటువంటిదే కొందరికి తెలియని ఓ వింత విజి కనిపించింది. దాని చూసినవారు బెంబేలిత్తిపోతున్నారు. ఇది మూగ జీవాలను పిక్కుతుంటుందంటూ పుకారు పుట్టించారు.

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు, కపిలేశ్వరపురంలో ఈ వింత జంతువు కనిపించింది. స్థానికంగా ఉన్న రైతులు దీనిని గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆలమూరు మండలం పెనికేరులోని ఓ నూతిలో ఉన్నట్లు రైతులు గుర్తించారు. అయితే విషయం తెలుసుకున్న అధికారులు. పెనికేరు బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. అది వింత జంతువు కాదని తేల్చారు.

పెనికేరు బావిలో ఉన్నది నీటి కుక్క అని అధికారులు తెలిపారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది గుర్తించాల్సి ఉందని వివరించారు. అయితే మూగ జీవాలపై దాడి చేస్తున్నది ఇదా కదా అనే విషయం మాత్రం చెప్పలేదు అధికారులు. కాగా ఇవి చేపలను వేటాడి తింటాయి.

తూర్పుగోదావరి జిల్లాలో వింత జంతువు