Earthquake: చిగురుటాకులా వణికిపోయిన న్యూజిలాండ్!

817

Earthquake: వరస భూకంపాలతో న్యూజిలాండ్ చిగురుటాకులా వణికిపోతోంది. మార్చి 4న భారీ భూకంపంతో హడలెత్తిన న్యూజిలాండ్​లో శనివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్​ స్కేలుపై 6.3 తీవ్రతగా నమోదైందని అమెరికా జియోలాజిల్​ సర్వే తెలిపింది. గిస్బోన్​ నగరానికి 181 కిలోమీటర్ల దూరంలో 9 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. అయితే ఇప్పటివరకు దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.