దేశరాజధానిలో భూకంపం.. 2.8గా నమోదు!

54

అసలే వాయుకాలుష్యంతో సతమతమయ్యే దేశరాజధాని ఢిల్లీ వాసులకు గురువారం ఉదయం భూకంపం వణికించింది. ఢిల్లీలో ఈ ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 9.17 గంటలకు పశ్చిమ ఢిల్లీలో భూమి కంపించిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది. రిక్టర్‌స్కేలుపై దాని తీవ్రత 2.8గా నమోదయ్యిందని ఎన్‌సీఎస్‌ తెలిపింది. భూకంప కేంద్ర ఢిల్లీకి వాయవ్యంలో ఉందని ఎన్‌సీఎస్‌ అధికారులు ప్రకటించారు. భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెప్పారు. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని పేర్కొనగా దీనిపై ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది.

దేశరాజధానిలో భూకంపం.. 2.8గా నమోదు!