ఈ వాచ్ యాప్ పై స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు

158

ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే.. ఈ ఎన్నికల్లో అక్రమాలను గుర్తించేందుకు ఎన్నికల కమిషన్ ఈ వాచ్ అనే యాప్ తీసుకొచ్చింది. ఎందులో ఎవరైనా ఎన్నికల నియమావళిని దిక్కరించినట్లు కనిపిస్తే వారి వీడియో తీసి ఈ యాప్ లో పోస్ట్ చెయ్యవచు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న వారి వీడియోలు తీసి పోస్ట్ చేసే అవకాశం దీనిలో ఉంది. అయితే ఈ యాప్ ను నిలుపుదల చెయ్యాలంటూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ యాప్ కొందరికి అనుకూలంగా ఉందని తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ నెల 9 తేదీ వరకు ఈ వాచ్ యాప్ ను అమలులోకి తీసుకురావద్దని హైకోర్టు తెలిపింది. యాప్ కు సంబందించిన పనితీరును పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది.

ఈ వాచ్ యాప్ పై స్టేటస్ కో ఇచ్చిన హైకోర్టు