దుర్గగుడి వెండి సింహాల దొంగ దొరికాడు!

183

దుర్గగుడి రథంపై ఉన్న మూడు వెండి సింహాల బొమ్మలు మాయమైన విషయం విదితమే.. ఈ కేసులో పోలీసులు పురోగతి సాదించినట్లుగా తెలుస్తుంది. ఈ కేసు విషయంలో దుర్గగుడి అదే విధంగా పక్కనే ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించారు. మొత్తం 40 మందిని విచారించగా వీరినుంచి ఎటువంటి ఆధారాలు లభించలేదు.

ఇక మరోవైపు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజిల కోసం ప్రయత్నించారు. అయితే దేవాలయం సీసీ టీవీల్లో ఆ ఫుటేజ్ లేదు. దింతో ఆలయ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేశారు. ఆలయ సిబ్బంది సహాయంతోనే దొంగతనం జరిగిఉంటుందని ఓ నిర్ధారణకు వచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే ఓ పాత నేరస్తుడే వీటిని దోపిడీ చేసినట్లుగా తెలిసింది. ఇటీవల దొంగతనం కేసులో బాలకృష్ణా అనే పాతనేరస్తున్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.

దొంగతనానికి సంబంధించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో దుర్గగుడి సింహం విగ్రాలను తానే దొంగిలించినట్లుగా తెలిపినట్లు సమాచారం. దింతో పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు విజయవాడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకొని అతడిని అదుపులోకి తీసుకోని విజయవాడ తరలించినట్లు సమాచారం. అయితే ఈ వెండి విగ్రహాలను తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన ఓ బంగారు వ్యాపారికి అమ్మినట్లుగా నిందుతుడు ఒప్పుకోవడంతో ఆ బంగారు వ్యాపారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

అయితే వీటిని కొనుగోలు చేసిన వెంటనే అతడు కరిగించినట్లుగా సమాచారం. అపహరణకు గురైన విగ్రహాల బరువు 16 కేజీలవరకు ఉంటుందని సమాచారం. ఇక ఈ విషయంలో గతంలో పెద్ద రచ్చే జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాకు రక్షణ కరువైందని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. కాగా నిందితులను త్వరలో మీడియా ముందు ప్రవేశపెడతారని సమాచారం.

 

దుర్గగుడి వెండి సింహాల దొంగ దొరికాడు!