దుర్గాడ సర్పంచి పదవి రూ. 33 లక్షలు

136

తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామ పంచాయితీ సర్పంచి పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పాల్గొన్నారు. వీరిలో ఒకరు రూ.33 లక్షలకు సర్పంచి పదవిని దక్కించుకున్నారు. ఈ డబ్బుతో గ్రామంలోని శివాలయంలో మండపం నిర్మించనున్నారు. కాగా ఈ వేలం బుధవారం రాత్రి జరిగింది. ఇక ఈ వేలంలో అధికంగా పాడిన వ్యక్తికే గ్రామస్తులు ఓట్లు వెయ్యాలని తీర్మానం చేశారు గ్రామ పెద్దలు, ఇక వార్డులకు కూడా వేలం నిర్వహించనున్నారట. ఎవరైతే ఎక్కువకు పాడుతారో వారికే గ్రామస్తులు ఓట్లు వేస్తారు. 15 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో సర్పంచ్ ఎన్నిక వేలం జరగ్గా రూ.5 లక్షలకు దక్కించుకున్నాడో వ్యక్తి. గ్రామస్తులంతా అతడికే ఓట్లు వేసి గెలిపించారు.

ఇక మరోవైపు పంచాయితీల్లో ఏకగ్రీవాలు కూడా అధికంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఏకగ్రీవమైన గ్రామపంచాయితీలకు నజరానా ప్రకటించడంతో చాలాగ్రామాల పెద్దలు ఏకగ్రీవానికి ఒకే చెబుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశ ఎన్నికల నామినేషన్స్ శుక్రవారం ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఎన్నికల కమిషన్ పూర్తి చేసింది. ఏకగ్రీవాలను తగ్గించేందుకు ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తుంది.

దుర్గాడ సర్పంచి పదవి రూ. 33 లక్షలు