దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులు సస్పెండ్

263

విజయవాడ దుర్గ గుడిలో పనిచేసే 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్జునరావు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నలుగురు సూపరిండెంట్ స్థాయి అధికారులు ఉండగా, మిగతావారు దేవాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసేవారు ఉన్నారు. తాజాగా గుడిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబదించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలతో పాటు అన్నదానం, దర్శనాల టికెట్ల అమ్మకం, అమ్మవారి చీరల వ్యవహారాల్లో భారీగా అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారు గుర్తించారు. వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఏడు రకాల విభాగాల్లో పనిచేసే సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు అన్నదానం, స్టోర్స్, హౌస్‌ కీపింగ్‌ విభాగపు సూపరింటెండెంట్లతో పాటు, గుడి భూములు, షాపుల లీజు వ్యవహారాలను పర్యవేక్షించే విభాగపు సూపరింటెండెంట్, ఇంద్రకీలాద్రి కొండపై వివిధ రకాల కౌంటర్లను నిత్యం పర్యవేక్షించే సూపరింటెండెంట్లను సస్పెండ్‌ చేస్తూ సురేష్‌బాబు చర్యలు తీసుకున్నారు.

దుర్గగుడిలో 13 మంది ఉద్యోగులు సస్పెండ్