రాత్రి 10 తర్వాతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

358

హైదరాబాద్ పరిధిలో డ్రింక్ అండ్ డ్రైవ్ పరీక్ష సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం మంచిదే కానీ దీని వలన గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు పోలీస్ అధికారులకు సోషల్ మీడియా ద్వారా తమ ఇబ్బందులు తెలిపారు. రాత్రి 9 గంటల సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం ద్వారా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, దింతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీనిపై స్పందించిన నగర పోలీసులు.. రాత్రి 9 గంటల్లోపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని భావించింది.

ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ విభాగం, 7 తరువాత ఎక్కడెక్కడ డ్రైవ్ లను జరిపారన్న విషయాన్ని ఆరా తీశారు. రాత్రి 9.30 గంటల తరువాతనే పరీక్షలు చేయాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు. మందుబాబులు కూడా 10 గంటల తరువాతనే రోడ్లపైకి వస్తారన్న అంచనాతోనే, అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో రాత్రి 9.30 తరువాతే డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను నిర్వహించాలని ఆదేశించామని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.

రాత్రి 10 తర్వాతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు