మందు తాగి పట్టుబడితే 10 ఏళ్ల జైలు శిక్ష

77

నగరంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు పోలీసులు. మద్యం సేవించి పట్టుబడితే ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేసి 10 ఏండ్లు జైలు శిక్ష పడేలా చూస్తామని మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ పోలీస్ కమిషినర్ సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారు టెర్రరిస్టులతో సమానమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పబ్ లు క్లబ్ పై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని సీపీ తెలిపారు.

కాగా సోమవారం జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 402 మంది మద్యం తాగి వాహనం నడిపి పట్టుపడినట్లు తెలిపారు. వీరిపై కేసులు పెట్టినట్లు వివరించారు. ఈ వారం పాటు సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ ఉంటాయన్నారు.. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్ తో పాటు ఎస్‌వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొంటారని.. మందు బాబులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చేశారు.

మందు తాగి పట్టుబడితే 10 ఏళ్ల జైలు శిక్ష