అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వరు – దేవుడి దయతోనే వస్తుంది – మంత్రి సంచలన వ్యాఖ్యలు

59

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు ఇవ్వడం అసాధ్యమని, దేవుడి దయ ఉంటేనే ఇల్లులు వస్తాయని అన్నారు. ప్రభుత్వం లక్ష ఇల్లు నిర్మిస్తామని చెప్పిన అది అసాధ్యమని, ఇప్పటివరకు 4 నుంచి 5 వేల ఇల్లు మాత్రమే నిర్మించగలిగామని అన్నారు. అందరికీ ఇళ్లు రావాలంటే 15, 20 ఏళ్లు పడుతుందన్నారు.

ఏ ప్రభుత్వం అయినా ఇంతే అని ప్రతి సంవత్సరంగా కడుతూనే ఉంటాం అని, దానికి అధికంగా లబ్ధిదారులు వస్తారని వివరించారు. ప్రతిఒక్కరూ దరఖాస్తు చేసుకోవద్దన్నారు. దేవుడి దయ ఉంటే లాటరీలో ముందుగానే వస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి కార్యక్రమంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు

అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వరు – దేవుడి దయతోనే వస్తుంది – మంత్రి సంచలన వ్యాఖ్యలు