Parliament session 2021 : సభలో మొబైల్ ఫోన్ వాడొద్దు – వెంకయ్య నాయుడు

74

పార్లమెంట్ సమావేశాలకు వచ్చి.. కొందరు ఎంపీలు సభలో జరుగుతున్న విషయాలను తమ చరవాణీల్లో బందిస్తున్నారు. సభ్యులు మాట్లాడుతున్న విషయాలను వినకుండా మొబైల్ ఫోన్స్ లో తలపెట్టుకొని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సభలో ఫోన్స్ వాడరాదని ఆదేశించారు. సభా కార్యక్రమాలను వీడియో తీయడం పార్లమెంట్ నిబంధనలకు విరుద్ధమని వెల్లడించారాయన. ఇక మీదట ఛాంబర్లలో, సభా ప్రాంగణంలో మొబైల్స్ అస్సలు వాడకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆప్ ఎంపీలు మొబైల్ తో వీడియోస్ తీయడంతో సభ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు రాజ్యసభ చైర్మన్ (ఉపరాష్ట్రపతి ) వెంకయ్య నాయుడు.

సభలో మొబైల్ ఫోన్ వాడొద్దు – వెంకయ్య నాయుడు