కోర్టులో “యువర్‌ ఆనర్”‌ అనొద్దు

263

కోర్టులో న్యాయవాదులు ‘యువర్ ఆనర్’ అని సంబోధిస్తూ కేసులోని వాదనలు వినిపిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ విధంగా పిలవడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థామైన సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ విధంగా పిలిచిన న్యాయ విద్యార్థి ఒకరిని హెచ్చరించింది. తమను యువర్ ఆనర్ అని సంబోధిస్తున్నావంటే నీ మనసులో అమెరికా సుప్రీంకోర్టు ఉన్నట్లు అనిపిస్తోందని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. యువర్ లార్డ్ షిప్ అని సంబోదించాలని తెలిపారు. కాగా యువర్ ఆనర్ అని పిలిచినందుకు సదరు విద్యార్థి కోర్టుకు క్షమాపణలు చెప్పాడు.

అనంతరం కేసు ఏంటని విద్యార్థిని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా తాను న్యాయవ్యవస్థలో నేర న్యాయ విభాగాన్ని బలోపేతం చేయాలంటూ దాఖలుక చేసిన అభ్యర్థనపై వ్యక్తిగతంగా హాజరయ్యానని తెలిపాడు. అయితే ఇప్పటికే ఈ వ్యవహారానికి సంబందించిన కేసు పెండింగ్ లో ఉందని ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది ధర్మాసనం. అప్పటివరకు పూర్తిగా సిద్ధమవ్వాలని విద్యార్థికి కోర్టు ఆదేశించింది.

కోర్టులో “యువర్‌ ఆనర్”‌ అనొద్దు