చివరకు గాడిదలను కూడా వదలడం లేదు.. ఆ సామర్థ్యం పెంచుతుందట!

201

మనిషి ఆహార అలవాట్లు రోజు రోజుకు మారిపోతున్నాయి.. శాకాహారులు కూడా మాంసం వైపు మొగ్గు చూపుతున్నారు. దింతో మార్కెట్లో మాంసం ఉత్పత్తుల రేట్లకు రెక్కలు వచ్చాయి. ఇదిలా ఉంటే అది అపోహా.. నిజమో తెలియదు కానీ ఓ వార్త గాడిదలు అంతరించిపోవడానికి కారణమవుతుంది. గాడిద మాంసం తింటే శృగార సామర్థ్యం పెరుగుతుందని, శరీరం దృడంగా అవుతుందని.

గాడిద రక్తం తాగితే ఆరోగ్యానికి మంచిదని.. ఎటువంటి రోగాలు రావని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దింతో మాంసం ప్రియుల మనసు గాడిదలపై పడింది. ఇంకేముంది కేజీలకు కేజీలు తెచ్చుకొని ఆరగిస్తున్నారు. దింతో గాడిదల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ గాడిద మాంసం విక్రయం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో అత్యధికంగా వినియోగిస్తున్నారు. దింతో ఆ జిల్లాలో గాడిదలు కనుమరుగై పోతున్నాయి.

కేవలం ఆ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని జిల్లాలపై ఈ ప్రభావం పడుతుంది. మాంసం కోసం గాడిదల రవాణా అధికంగా సాగుతుంది. అయితే చట్టప్రకారం గాడిదను వధించడం నేరం .. కానీ వధశాలలు నడిపేవారు ఇటువంటి వాటిని పట్టించుకోవడం లేదు. దింతో గాడిదల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. గేదెల్ల ఎవరు గాడిదలను పెంచరు. గతంలో దోబీ పని చేసేవారు గాడిదలను పెంచేవారు. ప్రస్తుతం కురుమలు తమ గొర్లతో పాటు వీటిని తీసుకెళ్తుంటారు.

కొన్ని సంచార జాతుల వారు కూడా గాడిదలను పెంచుతున్నాయి. వీరు వాటిని బరువు మోసేందుకు వాడుకుంటారు. అయితే రాను రాను గాడిదల సంఖ్య తగ్గిపోతుంది. ఇక వధశాలలకు వెళ్తుండటంతో ఇవి కనుమరుగై పోతున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా 5000 గాడిదలు కూడా ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. ఇక గాడిద మాంసం విక్రయించే వారు కర్ణాటక నుంచి వీటిని దిగుమతి చేసుకుంటున్నారు.

చివరకు గాడిదలను కూడా వదలడం లేదు.. ఆ సామర్థ్యం పెంచుతుందట!