డోనాల్డ్ ట్రంప్ కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపకూడదు.

662

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై డెమోక్రాట్స్ కక్షకట్టినట్లు కనిపిస్తుంది. ట్రంప్ పార్లమెంట్ లోకి రాకుండా డెమొక్రాట్స్ బిల్లు బిల్లు తెచ్చారు. అంతే కాదు మరణానంతరం ప్రభుత్వ లాంఛనాలతో జాతీయ స్మశానవాటికలో అంత్యక్రియలు కూడా జరపవద్దని ఈ బిల్లులో పెట్టారు. దీనిపై ప్రస్తుతం అమెరికా పార్లమెంట్ లో చర్చ నడుస్తుంది. గతేడాది నవంబర్ లో జరిగిన అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు.

ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి బైడెన్ గెలుపు చట్టవిరుద్ధమని ట్రంప్ కోర్టుల్లో పోరాడుతూ వచ్చారు. వైట్ హౌస్ ఖాళీ చేసేందుకు కూడా ట్రంప్ ఒప్పుకోలేదు. దేశ ప్రజలు పెద్దలు మొట్టికాయలు వెయ్యడంతో చివరికి వైట్ హౌస్ ఖాళీ చేశారు. చానళ్ళు ట్రంప్ తన ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. తన ఓటమిపై కోర్టులలో పోరాడుతూనే ఉన్నారు ట్రంప్. ఇక ఈ నేపథ్యంలోనే డెమోక్రాట్స్ పై ట్రంప్ బహిరంగ విమర్శలకు దిగారు. అనేక సార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ లో ట్రంప్ కి వ్యతిరేకంగా బిల్లు పెట్టినట్లు తెలుస్తుంది.

డోనాల్డ్ ట్రంప్ కి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపకూడదు.