ఎంఎంటీఎస్ రైల్లో శునకం ప్రయాణం

89

ఎంఎంటీఎస్ రైలు ఏంటి.. శునకం ప్రయాణించడం ఏంటని అనుకుంటున్నారా? ఇది నిజమే.. కానీ హైదరాబాద్ లో కాదు ముంబైలో. ముంబై నగరంలో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దీగా ఉంటాయి. అయినా ఓ శునకం రైలు ఎక్కింది. అంతలోనే రైలు కదిలింది. దింతో శునకం డోర్ వద్ద నిల్చొని మరో స్టేషన్ వచ్చే వరకు వేచి ఉంది. దీనిని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎప్పుడు ఆ పోస్ట్ వైరల్ గా మారింది. అయితే గతంలో కూడా శునకాలు ఎంఎంటీఎస్ రైల్లో ప్రయాణించాయని స్టేషన్ మాస్టర్ చెబుతున్నారు. అవి ఎవరిని ఏమనవని అన్నారు.

తిరిగి మళ్ళి ఇదే స్టేషన్ కు వస్తాయని తెలిపారు. అయితే ఆ ట్రైన్ లో ఎవరైనా రోజు ఆహారం అందించేవారు ఉంటే వారిని గుర్తు పట్టి వారితోపాటు రైలు ఎక్కుతాయని. కొన్ని శునకాలు వారు దిగే వరకు రైలు దిగవని తెలిపారు. మరికొన్ని పక్కస్టేషన్ లో దిగి మరో ఎంఎంటీఎస్ ఎక్కి రిటర్న్ వస్తాయని అన్నారు. అయితే ఇవి ఎవరికీ హానిచేయ్యవని, వాటికి మనుషులతో ఎలా మెలగాలో తెలుసనీ తెలిపారు. కానీ కొందరు ఆకతాయిలు వాటిని హింసించే ప్రయత్నం చేస్తారని, వారికీ ఎన్నిసార్లు చెప్పినా మారారని బాధపడుతూ వివరించారు. కాగా ఈ శునకాలు ఎక్కువగా సెంట్రల్ లైన్‌, కాల్వ స్టేషన్ల మధ్య అధికంగా తిరుగుతాయట.

 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఎంఎంటీఎస్ రైల్లో శునకం ప్రయాణం