“సోనుసూద్” కు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఇదే

1569

సోను సూద్ దేశంలో లాక్ డౌన్ దేవుడిగా పిలవబడుతున్నాడు. ఎంతో దయాగుణంతో అతడు చేసిన సేవలు సోను సూద్ ను రియల్ హీరోని చేశాయి. ఆ రియల్ హీరోకి ఇష్టమైన ప్రదేశం గురించి ఉద్వేగభరిత పోస్ట్ చేశారు. ‘‘తాను కలగన్న జీవితాశయం నేడు నెరవేరిందని, మా స్వస్థలం మోగాలో మా అమ్మ పేరిట ‘‘ప్రొఫెసర్‌. సరోజ్‌ సూద్‌ రోడ్‌’’గా రహదారికి నామకరణం చేశారని తెలిపారు.

తన జీవితంలో ఇదొక ముఖ్యమైన అధ్యాయమని సోను పేర్కొన్నారు, అమ్మ ఏ రోడ్డు గుండా తన జీవితకాలం ప్రయాణం చేసిందో ఇప్పుడు అదే రహదారికి ఆమె పేరు పెట్టారని వివరించారు. ఆ మార్గంలోనే ఆమె ఎక్కువగా నడిచారని తెలిపారు. కాలేజి నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజీకి వెళ్లేవారు. రోడ్డుకు తన పేరు పెట్టారన్న విషయం తెలిసి స్వర్గంలో ఉన్న తన తల్లిదండ్రులు కచ్చితంగా సంతోషిస్తారని అన్నారు. ఇన్ స్టా పోస్ట్ కు శిలాఫలకాన్ని జతచేశారు సోను.

ఈ విషయాన్ని సుసాధ్యం చేసిన హర్జోట్‌ కమల్‌, సందీప్‌ హాన్స్‌, అనితా దర్శి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పగలను. ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ..‘‘ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ రోడ్‌.. నా విజయానికి మార్గం’’ ’’ అంటూ రియల్‌ ‘హీరో’ సోనూసూద్‌ ఉద్వేగభరితంగా పోస్ట్ చేశారు.

 

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood)


“సోనుసూద్” కు అత్యంత ఇష్టమైన ప్రదేశ్ ఇదే