ఒక నెలలో వాట్సాప్ నుండి వెళ్లే మెసేజెస్ ఎన్నో తెలుసా?

131

వాట్సాప్.. ఇప్పుడు ఈ మెసేజింగ్ యాప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదంటే నమ్మొచ్చు. ఫోటో, వీడియో షేరింగ్.. కాంట్రాక్ట్, లొకేషన్.. డాక్యుమెంట్ ఏదైనా అవతలి వారికి పంపించాలంటే ముందుగా గుర్తొచ్చేసి వాట్సాప్. మన భారత ప్రభుత్వం.. వాట్సాప్ మధ్య ఎండ్-టు-ఎండ్ వివాదం ఒకటి సాగుతుండగా.. వాట్సాప్ బదులుగా మరికొన్ని యాప్స్ వస్తున్నా వాట్సాప్ దూకుడు మాత్రం తగ్గడం లేదు. ఈ సంస్థ గురువారం (ఫిబ్ర‌వరి 25)తో 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పుష్క‌ర కాలంలో సంస్థ సాధించిన ఘ‌న‌త‌ల‌ను చెబుతూ 12వ వార్షికోత్స‌వాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటోంది.

ఈ సంద‌ర్భంగా వాట్సాప్ ద్వారా వెళ్తున్న మెసేజ్‌లు, వాయిస్ కాల్స్‌, వీడియో కాల్స్ గణాంకాల‌ను పంచుకుంది. ఈ 12 ఏళ్ల‌లో వాట్సాప్ ప్ర‌పంచవ్యాప్తంగా 200 కోట్ల మంది యూజ‌ర్ల‌ను సొంతం చేసుకుంది. వాట్సాప్ నుంచి ప్ర‌తి నెలా ఈ 200 కోట్ల మంది యూజ‌ర్లు ఏకంగా ప‌ది వేల కోట్ల మెసేజ్‌లు వెళ్తున్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. అంతేకాదు రోజుకు 100 కోట్ల కాల్స్ కూడా వాట్సాప్ నుంచి వెళ్తుండ‌టం విశేషం. ఇక యూజ‌ర్ల ప్రైవ‌సీకి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని వాట్సాప్ మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. త‌మ ప్లాట్‌ఫామ్‌పై ఎప్ప‌టికీ ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్ష‌న్ ఉంటుంద‌ని కూడా తేల్చి చెప్పింది.

ఒక నెలలో వాట్సాప్ నుండి వెళ్లే మెసేజెస్ ఎన్నో తెలుసా?