చేతులెత్తి మొక్కుతున్నా..రైతులను తప్పుదోవ పట్టించొద్దు – మోడీ

79

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిసాన్ కళ్యాణ్ పథకాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఈ పథకాన్ని ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో పంటనష్టపోయిన 35 లక్షలమంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 16 వేలకోట్ల రూపాయలు జమచేయడం జరిగిందని తెలిపారు. రైతుల మేలుకోరి అనేక పథకాలు తీసుకొచ్చామని అన్నారు.

రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను ఇచ్చామని వివరించారు. రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. గోదాముల సామర్థ్యం పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రైతులు తాము పండించిన కూరగాయలు, పండ్లు వంటివి దాచుకునే విధంగా శీతల గిడ్డంగులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే రైతులను ఉద్దేశిస్తూ మాట్లాడిన మోడీ భావోద్వేగానికి లోనయ్యారు. రైతులను తప్పుదోవ పట్టించవద్దని విపక్షాలకు చేతులు జోడించి అభ్యర్థించారు. సాగు చట్టాల విషయంలో రైతులను తప్పుదోవ పట్టించే ధోరణిని విపక్షాలు మానుకోవాలి. అన్ని ఆలోచించే ఈ చట్టాలు తెచ్చాము.

రైతులను నష్టపరిచే చట్టాలు తేవాల్సిన వసరం తమకు లేదని అన్నారు. రైతులు తాము పండించిన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే హక్కు కల్పించామని తెలిపారు.

చేతులెత్తి మొక్కుతున్నా..రైతులను తప్పుదోవ పట్టించొద్దు – మోడీ