దివి వారి పిల్ల.. మరికాస్త పెంచేసిందండోయ్!

231

దివి వద్త్యా ఈ పేరు చెప్తే పెద్దగా అర్ధం అదేమో కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దివి అంటే తెలుగు సినీ ప్రేమికులకు ఈజీగా తెలిసిపోతుంది. ఈ బిగ్ బాస్ బ్యూటీ మహర్షితో పాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. మోడల్‌గా యాక్టర్‌గా రాణించాలనీ కోరుకుంటున్న ఈ బ్యూటీకి బిగ్ బాస్ వేదిక కావాల్సినంత పాపులారిటీ వచ్చేసింది. ఇక ఇదే స్పీడుతో అవకాశాలు దక్కించుకోవాలన్న ఈ సొట్టబుగ్గల సుందరి వరసపెట్టి ఫోటో షూట్స్ చేసి జనాల మీదకి వదిలేస్తుంది.

 బిగ్ బాస్ 4 బ్యూటీ దివి లేటెస్ట్ పిక్స్ (Divi Vadthya/Instagram)

ఒకసారి స్విమ్ షూట్.. మరొకసారి జీన్స్-టీషర్ట్.. అచ్చమైన చీరకట్టులో ఇంకోసారి కనికట్టు చేస్తూ ఫోజులిచ్చి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అసలే మొన్నటి వరకు బిగ్ బాస్ ఇంట్లో నుండి ప్రతి ఇంట్లో పిల్లగా దగ్గరైన ఈ చిన్నది ఇప్పుడు అలా హాట్ హాట్ భంగిమలలో ఫోటోలు చూసి తట్టుకోవడం కుర్రకారుకి కష్టమైపోతుంది. మత్తు కళ్ళతో మైమరపించే ఈ అందాలకు ఎంతవరకు అవకాశాలు దక్కుతాయో కానీ మరికొన్నాళ్లు విరామం లేకుండా అందాలతో చంపేయడం ఖాయంగా కనిపిస్తుంది.

 బిగ్ బాస్ 4 బ్యూటీ దివి లేటెస్ట్ పిక్స్ (Divi Vadthya/Instagram)

దివి వారి పిల్ల.. మరికాస్త పెంచేసిందండోయ్!