దిశను మించిన ఘటన.. హైదరాబాద్ శివార్లలో మరో దారుణం

202

హైదరాబాద్ ఘట్కేసర్ పరిధిలో బీ ఫార్మసీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. కాలేజీ బస్సు దిగిన విద్యార్థిని ఇంటికి వెళ్లేందుకు రాంపల్లి చౌరస్తా వద్ద ఆటో ఎక్కింది. ఆటోలో ఆమెతోపాటు డ్రైవర్ మరో మహిళ ఒక యువకుడు ఉన్నాడు. మహిళ తన స్టాప్ రాగానే దిగిపోయింది. పక్క స్టాప్ లో విద్యార్థిని దిగాల్సి ఉంది. అయితే డ్రైవర్ ఆపకుండా అలానే పోనిచ్చాడు. ఆటో డ్రైవర్ మరో ఇద్దరికీ ఫోన్ చేసి పిలిపించుకున్నాడు, దింతో విద్యార్థిని ఇంటికి ఫోన్ చేసి తాను ప్రమాదంలో ఉన్నానని తల్లిదండ్రులకు విషయం తెలిపింది. దింతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షణాల్లో స్పందించిన పోలీసులు వాహనాల్లో సైరన్ వేసుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. ఘాట్ కేసర్ పరిసర ప్రాంతాల్లో సైరన్ల మోత మోగించారు. ఈ క్రమంలోనే దుండగులు విద్యార్థినిని ఎల్లంపేట, వద్ద మరో వ్యాన్ లోకి మార్చారు.. ఈ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో దాడి చేశారు. వస్త్రాలు చింపేశారు. ఘాట్ కేసర్ రైల్వే ట్రాక్ దాడి వ్యాన్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. పొలిసు సైరన్ల మోత ఎక్కువగా వినిపించడంతో అన్నోజిగూడ పార్క్ దగ్గర పొదల్లో పడేసి వెళ్ళిపోయాడు. వెంటనే ఆమెను చూసిన ఓ ఎస్ఐ ఆమెను భుజంపై వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

అయితే నిందితుల్లో ఒకడైన ఆటో డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు సమాచారం. ఆమె మాట్లాడలేకపోతుందని పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిందా లేదా అనే విషయం డాక్టర్లు నిర్దారించనున్నారు. ఇక నిందితులను గుర్తించేందుకు పది బృందాలు రంగంలోకి దిగాయి. డీఎస్పీ రక్షణ మూర్తి విషయం తెలియగానే ఘాట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ ఘటనపై గిరిజన సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కాగా యువతి సమయస్ఫూర్తిగాని అందరు మెచ్చుకుంటున్నారు. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చెయ్యకపోతే మృగాళ్ల చేతిలో పడి ఏమయ్యేదో అని అనుకుంటున్నారు. ఈ ఘటనతో ఘాట్ కేసర్ ప్రాంతం ఉలిక్కిపడింది. పోలీసుల సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇక నిందుల గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

దిశను మించిన ఘటన.. హైదరాబాద్ శివార్లలో మరో దారుణం