అరుదైన ఘనత సాధించిన దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం

111

ISO సెర్టిఫికెట్ సాధించిన దిల్ షుఖ్ నగర్ సాయిబాబా ఆలయం హైదరాబాద్ నగరంలో ప్రముఖ దేవాలయాలు చాలా ఉన్నాయి. వీటిలో ఒకటి దిల్సుఖ్ నగర్ లోని సాయి బాబా ఆలయం ఈ దేవాలయానికి ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గురువారం రోజు భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది.

కాగా ఈ దేవాలయం అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) సెర్టిఫికెట్ అందుకుంది. తెలంగాణలో ISO సెర్టిఫికెట్ అందుకున్న దేవాలయాలు మూడు ఉన్నాయి అందులో ఒకటి యాదగిరి లక్ష్మి నరసింహ స్వామి, వరంగల్ భద్రకాళి అమ్మవారి దేవాలయలు కాగా మూడవ దేవాలయం దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం.

ఈ సెర్టిఫెకెట్ ను ఎమ్మెల్సీ కవిత ఆలయ అర్చకులకు అందచేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నిర్వహణ, వసతుల కల్పన, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పని చేసే ట్రస్ట్, అవినీతి రహితంగా గుర్తింపు పొందడటం వంటి విశేషాలు ఉన్నప్పుడే ఈ గుర్తింపు ఇస్తారు. దిల్ షుఖ్ నగర్ సాయిబాబా ఆలయం వీటిలో ఎంతో మెరుగ్గా పని చేయటంతో.. ఈ గుర్తింపు వచ్చింది.