Dil Raju: మరో వారసుడి అరంగేట్రానికి సర్వం సిద్ధం!

435

Dil Raju: తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దిల్ రాజుకు పేరు. డిస్టిబ్యూటర్ గా కెరీర్ ప్రారంభించిన రాజు నిర్మాతగా మారి తొలి సినిమా దిల్ నే తన ఇంటి పేరుగా మార్చుకొని స్టార్ హీరోల నుండి డెబ్యూ హీరోల వరకు సక్సెస్ సినిమాలను తన ఖాతాలలో వేసుకుంటున్నాడు. కథ విని, పోస్టర్ చూసి సినిమా రిజల్ట్ చెప్పేయగలడని కూడా దిల్ రాజుకు పేరు. నితిన్, నాగ చైతన్యలను హీరోలుగా పరిచయం చేసిన దిల్ రాజు పవన్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, వెంకటేష్ ఇలా అందరు స్టార్ హీరోలతో సినిమాలు తీసి విజయవంతమయ్యాడు. ఇక ఇప్పుడు తన వారసుడి వంతు వచ్చేసింది.

ఔను.. దిల్ రాజు ప్రస్తుతం తన వారసుడిని హీరోగా పరిచయం చేసేందుకు సిద్దమయ్యాడట. అతని పేరు ఆశిష్ రెడ్డి. ఆశిష్ దిల్ రాజు సోదరుడి కుమారుడు. దిల్ రాజుకి సోదరుడు శిరీష్ అంటే అమితమైన అభిమానం. ఎందుకంటే ఒక్కసారి దిల్ రాజు ఒక సినిమా మొదలు పెడితే బాధ్యత మొత్తం శిరీష్ చూసుకోవాల్సిందే. రాజుతో పాటు ప్రతి సినిమా నిర్మాణంలో కూడా శిరీష్ భాగస్వామిగా ఉంటారు. అందుకే శిరీష్ కుమారుడు ఆశీష్ అంటే దిల్ రాజుకు కొడుకు కన్నా ఎక్కువే. ఇప్పుడు శిరీష్ అరంగేట్రం బాధ్యత దిల్ రాజు అన్నీ తానై చూస్తున్నారట.

సహజంగానే బయట హీరోలతో సినిమా అంటే ఒకటికి పదిసార్లు అలోచించి అన్ని విధాలుగా ఒకే అనుకుంటేనే దిల్ రాజు సినిమా పట్టాలెక్కేది. మరి అలాంటిది సొంత వారసుడి సినిమా అంటే అంత ఈజీగా వదులుతారా. అందుకే ఇప్పుడు ఓ పక్కా కథతో ఆశిష్ లాంచింగ్ ఉండబోతుందట. కానీ ఎవరో స్టార్ డైరెక్టర్ ను తీసుకొచ్చి భారీ యాక్షన్ కథతో ఈ సినిమా ఉండబోతుందంటే అది పొరపాటే. హుషారు సినిమాతో మంచి దర్శకుడిగా పేరుతెచ్చుకున్న శ్రీహర్ష ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా దేవిశ్రీ సంగీతం, మధి సినిమాటోగ్రఫీ లాంటి భారీ టెక్నీకల్ వాల్యూస్ అయితే సెట్ చేస్తున్నాడట. మరి ఎందరో హీరోలు, దర్శకుల సక్సెస్ లో భాగమైన దిల్ రాజు తన వారసుడికి ఎలాంటి సక్సెస్ ఫుల్ జర్నీ సెట్ చేస్తాడో చూడాలి!

Dil Raju: మరో వారసుడి అరంగేట్రానికి సర్వం సిద్ధం!