రామ మందిర నిర్మాణానికి డిగ్గీరాజా విరాళం

237

అయోధ్య రామమందిర నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. దేవాలయ నిర్మాణం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి నిధులు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొంటున్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమం ఉవ్వెతున ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నెల 20 నుంచి ఇంటింటికి తిరిగి నిధి సేకరించనున్నారు.

రామ మందిర నిర్మాణం కోసం ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం తనవంతు విరాళం సమర్పించారు. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టుకు విరాళం అందజేశారు. విరాళం ఇవ్వడంతోపాటు ప్రధాని నరేంద్రమోదీకి దిగ్విజయ్‌సింగ్ లేఖ కూడా రాశారు. లేఖలో మందిర నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన వారి వివరాలు బహిర్గతం చెయ్యాలని పేర్కొన్నారు. కాగా దిగ్విజయ్ సింగ్ రూ. 1,11,111 విరాళం అందించారు.