Digital budget: నిర్మలమ్మ బడ్జెట్.. ఏ రంగానికి ప్రాధాన్యత దక్కిందంటే?

255

Digital budget: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదువుతున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆమె, పలు కీలక నిర్ణయాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి గురించి కూడా నిర్మలమ్మ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందనీ, త్వరలోనే దీని బారి నుంచి ప్రజలంతా సురక్షితంగా బయటపడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొవిడ్ 19 వ్యాక్సినేషన్ల కోసం బడ్జెట్ లో ఏకంగా 35 వేల కోట్ల నిధిని కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అవసరం అయితే ఈ నిధిని మరింత పెంచుతామని ఆమె హామీ ఇచ్చారు. ఇక ఏఏ రంగంలో ఈ బడ్జెట్ లో ఊరట కలిగిందో.. ఏ రంగానికి ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత దక్కిందో.. ఈ బడ్జెట్ ప్రభావం ఏఏ రంగంలో కనిపించి ధరల పెరుగుదల.. తగ్గుదల ఉంటుందో చూడాలి.

త‌గ్గ‌నున్న బంగారం ధ‌ర‌లు
-త‌గ్గ‌నున్న బంగారం, వెండి ధ‌ర‌లు
-పెర‌గ‌నున్న కార్ల విడిభాగాల ధ‌ర‌లు
-మొబైల్ రేట్లు పెరిగే అవ‌కాశం
-నైలాన్ దుస్తుల ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం
-సోలార్ ఇన్వ‌ర్ట‌ర్ల‌పై ప‌న్ను పెంపు
-ఇంపోర్టెడ్ దుస్తులు మ‌రింత ప్రియం

మ‌రో ఏడాది పొడిగింపు
-ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న మ‌రో ఏడాది పొడిగింపు
-అందుబాటు ధ‌ర‌ల గృహ‌రుణాల రాయితీ ప‌థకం మ‌రో ఏడాది పొడిగింపు
-అందుబాటు ధ‌ర‌ల్లో గృహాలు నిర్మించే సంస్థ‌ల‌కు మ‌రో ఏడాది పాటు పన్ను విరామం

బ‌డ్జెట్ అంచ‌నా
-2021-22 బ‌డ్జెట్ అంచ‌నా మొత్తం రూ. 34.83 ల‌క్ష‌ల కోట్లు
-15వ ఆర్థిక సంఘం సిఫార్సుల‌కు కేంద్రం ఆమోదం
-17 రాష్ర్టాల్లో రెవెన్యూ లోటు భ‌ర్తీకి రూ. 17,340 కోట్లు

ద్ర‌వ్య‌లోటు అంచ‌నా 9.5 శాతం
-ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ద్ర‌వ్య‌లోటు అంచ‌నా 9.5 శాతం
-2021-2022లో ద్ర‌వ్య‌లోటును 6.8 శాతానికి ప‌రిమితం చేయాల‌ని ల‌క్ష్యం
-ద్ర‌వ్య‌లోటును ప్ర‌భుత్వ అప్పుల ద్వారా భ‌ర్తీకి ప్ర‌య‌త్నాలు
-వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 12 ల‌క్ష‌ల కోట్లు అప్పులు తేవాల‌ని నిర్ణ‌యం
-ఈ 2 నెల‌ల్లో ఇంకా రూ. 80 వేల కోట్లు అప్పులు చేయాల్సి ఉంది
-2025-26 నాటికి ద్ర‌వ్య‌లోటును 4.5 శాతం లోపు ప‌రిమితం చేయాల‌ని ల‌క్ష్యం

ఐటీ రిట‌ర్న్స్‌
-75 ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తులు ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేదు
-పింఛ‌ను, వ‌డ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మిన‌హాయింపు
-ప‌న్ను వివాదాల నివార‌ణ‌కు వివాద ప‌రిష్కార క‌మిటీ
-రూ. 50 ల‌క్ష‌ల లోపు ఆదాయం, రూ. 10 ల‌క్ష‌ల లోపు వివాదాలు ఉన్న‌వారు నేరుగా క‌మిటీకి అప్పీల్ చేసే అవ‌కాశం

కోటి మందికి ఉజ్వ‌ల ప‌థ‌కం
– వ‌ంట గ్యాస్‌కు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న
– న‌గ‌రాల్లో ఇంటింటికి వంట‌ గ్యాస్ స‌ర‌ఫ‌రా చేసే ఉజ్వ‌ల ప‌థ‌కం
– దేశంలో మ‌రో కోటి మంది ల‌బ్ధిదారుల‌కు ఉజ్వ‌ల ప‌థ‌కం.
– కొత్త‌గా మ‌రో 100 జిల్లాల్లోని న‌గ‌రాల‌కు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూష‌న్ నెట్‌వ‌ర్క్
-జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రంలో గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం
-సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల్లోకి వీధి వ్యాపారులు
-గోవా డైమండ్ జూబ్లీ ఉత్స‌వాల‌కు రూ. 300 కోట్లు
-అంకురల‌ సంస్థ ప్రోత్సాహానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు
-డిజిట‌ల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ. 1500 కోట్లు

750 ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌లు
-స్వ‌చ్ఛంద సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో మ‌రో 100 సైనిక పాఠ‌శాల‌లు ఏర్పాటు
-గిరిజ‌న విద్యార్థుల కోసం కొత్త‌గా 750 ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌లు
-హైద‌రాబాద్‌లో 40 వ‌ర‌కు ఉన్న‌త విద్యాసంస్థ‌లు ఉన్నాయి
-దేశ వ్యాప్తంగా 9 న‌గరాల్లో ఉన్న‌త విద్యాసంస్థ‌లు ఉన్నాయి

నీతి ఆయోగ్‌కు ఆదేశం
-పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ త‌ర్వాత జాబితా త‌యారు చేయాల‌ని నీతి ఆయోగ్‌కు ఆదేశం
-వ్యూహాత్మ‌క 4 రంగాలు మిన‌హా అన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌

చిన్న ప‌రిశ్ర‌మ‌లు అవే..
-చిన్న ప‌రిశ్ర‌మ‌ల నిర్వ‌చ‌నంలో మార్పు
-రూ. 50 ల‌క్ష‌ల నుంచి రూ. 2 కోట్ల పెట్టుబ‌డి ప‌రిమితి వ‌ర‌కు చిన్న‌సంస్థ‌లుగా గుర్తింపు
– వ్య‌వ‌సాయ రుణాల ల‌క్ష్యం రూ. 16.5 ల‌క్ష‌ల కోట్లు
-బ్యాంకుల మొండి బకాయిల కోసం ఆస్తుల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ సంస్థ ఏర్పాటు

ఎక్క‌డైనా రేష‌న్‌
-వ‌ల‌స కార్మికుల‌కు దేశంలో ఎక్క‌డైనా రేష‌న్ తీసుకునే అవ‌కాశం
-కుటుంబ స‌భ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్ర‌కారం రేష‌న్ తీసుకునే అవ‌కాశం

స్టార్ట‌ప్‌ల‌కు చేయూత
-స్టార్ట‌ప్‌ల‌కు చేయూత కోసం ఏక‌స‌భ్య కంపెనీల‌కు మ‌రింత ఊతం
-కంపెనీలు ఒక వ్యాపారం నుంచి మ‌రో వ్యాపారానికి మారే స‌మ‌యం 180 నుంచి 120 రోజుల‌కు కుదింపు

బీమా చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌
-1938 బీమా చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌
– బీమా కంపెనీల్లో ఎఫ్‌డీఐల ప‌రిమితి 49 నుంచి 74 శాతానికి పెంపు

రెండంకెల వృద్ధి త‌ప్ప‌నిస‌రి
-కొత్త ప్రాజెక్టుల కోసం ప్ర‌స్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ త‌ప్ప‌నిస‌రి
-రూ. 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ ల‌క్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి త‌ప్ప‌నిస‌రి

విద్యుత్ రంగం
-విద్యుత్ రంగానికి రూ. 3.05 ల‌క్ష‌ల కోట్లు
-పీపీఏ ప‌ద్ధ‌తి ద్వారా 2,200 కోట్ల‌తో ఏడు కొత్త ప్రాజెక్టులు
-సౌర శ‌క్తి రంగానికి మ‌రో వెయ్యి కోట్లు
-జ‌మ్మూక‌శ్మీర్‌లో గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు

రైల్వేరంగం
-రైల్వేల‌కు రూ. 1.15 ల‌క్ష‌ల కోట్లు
-మెట్రో లైట్‌, మెట్రో న్యూ పేరుతో ప్రాజెక్టులు
-బెంగ‌ళూరులో మెట్రో విస్త‌ర‌ణ‌కు రూ. 14 వేల 700 కోట్లు
-చెన్నై మెట్రో విస్త‌ర‌ణ‌కు రూ. 63 వేల కోట్లు

పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌కు నిర్ణ‌యం
-ప‌లు సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌కు నిర్ణ‌యం
-గెయిల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్ పైపులైన్ల‌లో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌
-జాతీయ స్థాయిలో పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌త్యేక డ్యాష్ బోర్డు
– రాష్ర్టాలు, స్వ‌యం ప్ర‌తిప‌త్తి వ్య‌వ‌స్థ‌ల మూల‌ధ‌న వ్య‌యం కోసం రూ. 2 ల‌క్ష‌ల కోట్లు

27.1 ల‌క్ష‌ల కోట్ల‌తో ప్యాకేజీలు
-క‌రోనా స‌మ‌యంలో రూ. 27.1 ల‌క్ష‌ల కోట్ల‌తో ప్యాకేజీలు ప్ర‌క‌టించాం
-ప్యాకేజీలు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కాపాడి సంస్క‌ర‌ణ‌ల‌కు ఊత‌మిచ్చాయి
-13 రంగాల్లో పీఎల్ఐ ప్రోత్సాహ‌కాల కోసం ఖ‌ర్చుకు నిర్ణ‌యం
– రానున్న మూడేళ్ల‌లో 7 టెక్స్‌టైల్స్ పార్కుల ఏర్పాటు

జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధి
-5 ప్ర‌త్యేక జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధికి రూ. 5 వేల కోట్లు
-11 వేల కిలోమీట‌ర్ల జాతీయ ర‌హ‌దారుల కారిడార్ నిర్మాణం
– అసోం, కేర‌ళ‌, బెంగాల్‌లో జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధి
-బెంగాల్‌లో 675 కిలోమీట‌ర్ల మేర జాతీయ ర‌హ‌దారుల అభివృద్ధి

ప్ర‌త్యేక స‌రుకు ర‌వాణా కారిడార్లు
-2022 జూన్ నాటికి తూర్పు, ప‌శ్చిమ ప్ర‌త్యేక స‌రుకు ర‌వాణా కారిడార్లు
-ఖ‌ర‌గ్‌పూర్ – విజ‌య‌వాడ మ‌ధ్య ఈస్ట్ – కోస్ట్ స‌ర‌కు ర‌వాణా కారిడార్‌

ఆరు మూల స్తంభాలు
– బ‌డ్జెట్ 2021లో భాగంగా ఆరు మూల స్తంభాల‌ను ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.
-ఇందులో మొద‌టిది ఆరోగ్యం, సంర‌క్ష‌ణ
-రెండోది ఫిజిక‌ల్‌, ఫైనాన్షియ‌ల్ క్యాపిట‌ల్ అండ్ ఇన్‌ఫ్రా
-మూడోది స‌మ్మిళిత వృద్ధి
– నాలుగోది హ్యూమ‌న్ క్యాపిట‌ల్‌.
– ఐదోది ఇన్నోవేష‌న్ అండ్ రీసెర్చ్ & డెవ‌ల‌ప్‌మెంట్ (ఆర్ & డీ)
– ఆరోది క‌నిష్ఠ‌ ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న
-ఈ ఆరు మూల స్తంభాల‌పైనే బడ్జెట్‌ను రూపొందించిన‌ట్లు నిర్మ‌ల తెలిపారు.

స్వ‌చ్ఛ‌భార‌త్ అర్బ‌న్
-ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ కోసం స్వ‌చ్ఛ‌భార‌త్ అర్బ‌న్‌
-ఐదేళ్ల‌లో స్వ‌చ్ఛ‌భార‌త్ అర్బ‌న్ కోసం రూ. 1,41,670 కోట్లు

వాహ‌నాల ఫిట్‌నెస్
– దేశంలోని వాహ‌నాల ఫిట్‌నెస్ ప‌రీక్ష‌కు ప్ర‌త్యేక విధానం
-వ్య‌క్తిగ‌త వాహ‌నాల‌కు 20 ఏండ్లు, వాణిజ్య వాహ‌నాల‌కు 15 ఏండ్లు
– కాల‌ప‌రిమితి ముగిసిన త‌ర్వాత ఫిట్‌నెస్ ప‌రీక్ష‌కు వెళ్లాల‌ని నిబంధ‌న‌
-తుక్కు వాహ‌నాల ర‌ద్దు, అధునాత‌న వాహ‌నాల వినియోగం
-15 ఏండ్లు దాటిన వాణిజ్య వాహ‌నాల‌ను తుక్కు కింద మార్చే ప‌థ‌కం

ప్ర‌ధాని జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ అర్బ‌న్‌
– ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ర‌క్షిత మంచినీటి కోసం ప్ర‌ధాని జ‌ల్‌జీవ‌న్ మిష‌న్ అర్బ‌న్‌
-ర‌క్షిత మంచినీటి ప‌థ‌కాల కోసం రూ. 87 వేల కోట్లు
-రూ. 87 వేల కోట్ల‌తో 500 న‌గ‌రాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు
-ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ కోసం స్వ‌చ్ఛ‌భార‌త్ అర్బ‌న్‌

ఆరోగ్య రంగం
-ఆరోగ్య రంగంలో రూ. 64,180 కోట్ల‌తో ప్ర‌త్యేక నిధి
-నివార‌ణ‌, చికిత్స‌, సంపూర్ణ ఆరోగ్య విధానంలో ప‌థ‌కం
-కొత్త‌గా 9 బీఎస్ఎల్ -3 స్థాయి ప్ర‌యోగ‌శాల‌లు
-15 అత్య‌వ‌స‌ర ఆరోగ్య కేంద్రాలు
-ప్ర‌పంచ దేశాల‌కు భార‌త్ ఓ ఆశాకిర‌ణంగా కనిపిస్తోంది
-ఆర్థిక వ్య‌వ‌స్థ చరిత్ర‌లో మూడుసార్లు మాత్ర‌మే జీడీపీ మైన‌స్‌లో ఉంది.