ఏ వాషింగ్ మిషన్ బెటరో ఇలా తెలుసుకోండి..

2219

బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ అవసరం.. ధనవంతుల ఇళ్లలో వాషింగ్ మెషిన్ సర్వ సాధారణం. అయితే ఇది కొనే ముందు చాలారకాలుగా ఆలోచిస్తారు.. ఫ్రంట్ లోడ్ తీసుకోవాలా, టాప్ లోడ్ తీసుకోవాలా అని. అయితే ఏ టైపు వాషింగ్ మెషిన్ తీసుకుంటే సౌకర్యవంతంగా ఉంటుందో ఈ కింది వివరాల్లో ఉంది. టాప్-లోడింగ్ మెషీన్లు సాధారణంగా బట్టలు లోడ్ చేయడానికి అలాగే దించడానికి ఒంగవలసిన అవసరం లేదు.. పెద్దవారికీ, జాయింట్ ప్రాబ్లంస్ ఉన్నవారికీ ఇబ్బంది ఉండదు.. ఎందుకంటే వారికి అనువైన ఎత్తులో టాప్ లోడ్ ఉంటుంది కాబట్టి. అయితే ఫ్రంట్ లోడ్ లో మాత్రం బట్టలు వేయడానికి లేదా తీయడానికి ఒంగవలసి ఉంటుంది. ఇది పెద్దవాళ్లకు అంత సౌకర్యవంతంగా ఉండదు. అంతేకాదు మధ్యలో పాజ్ చేసి మర్చిపోయినా బట్టలు ఏమైనా ఉంటే టాప్ లోడ్ లో ఉతకడానికి వేయవచ్చు. ఈ ఫీచర్ ఫ్రంట్ లోడ్ లో అందుబాటులో ఉండదు. టాప్-లోడింగ్ వాషింగ్ మెషిన్లను హై-ఎఫిషియెన్సీ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అని పిలుస్తారు.. ఒకేసారి ఎక్కువ బట్టలను తక్కువ నీటితో శుభ్రం చేయగలవు.

యాజిటేటర్ ఉన్న టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ ఫ్రంట్ లోడ్ కన్నా త్వరగా వాష్ ని పూర్తి చేస్తాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ బాగానే ఉంటుంది కానీ, బట్టలు కొంచెం రఫ్ గా వాష్ అవుతాయి. ఓవర్ లోడ్ అయినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్ టాప్ లోడ్ కంటే ఖరీదు ఎక్కువే. కానీ, టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు బాగా క్లీన్ చేస్తాయి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కొద్దిరోజులకు డోర్ కు ఉండే రబ్బర్ గాస్కెట్ మీద మోల్డ్ బిల్డప్ అవుతుంది.. దీనివలన ఎక్కువ మెయింటెనెన్స్ అవసరం.. టాప్ లోడ్ లో ఈ ప్రాబ్లమ్ ఉండదు. ఫైనల్ స్పిన్ సైకిల్ లో ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు 33 శాతం అధికంగా స్పిన్ అవుతాయి. దాంతో బట్టలలో ఉండే నీరు దాదాపు బయటకు వచ్చేస్తుంది.. బట్టలు తొందరగా ఆరిపోతాయి. అయితే దీనిద్వారా వైబ్రేట్ సౌండ్ ఎక్కువగా వస్తుంది.