రేపటికల్లా ఏలూరులో వింతవ్యాధికి కారణాలు తెలిసే అవకాశం

83
details-eluru-mystery-illness-updates
details-eluru-mystery-illness-updates

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. అయిదోరోజు బాధితుల సంఖ్య తగ్గడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. ప్రస్తుతం 47 మంది బాదితులు చికిత్స పొందుతున్నారన్నారు. ఇప్పటి వరకు ఒకరు మాత్రమే మృతి చెందారు. 47 మందిలో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి 26 మంది బాధితులను తరలించగా.. ఇద్దరిని డిశ్చార్జి చేశారు. 24 మంది చికిత్స పొందుతున్నారు.

కాగా ఈ వ్యాధి ప్రబలడానికి గల కారణాలను అన్ని కోణలో దర్యాప్తు చేస్తున్నారు. మనుషులతో పాటు జంతువల సాంపిల్స్ సేకరిస్తున్నారు. దాల్, రైస్, వెజిటేబుల్స్, రక్తనమూనాల సాంపిల్స్ సేకరించారు. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా కేంద్ర సంస్థలు ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలు శుక్రవారం నాటికి తెలిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.