దేశంలో 25 కు చేరిన కొత్తరకం కరోనా బాధితులు

68

యూకేలో రూపాంతరం చెందిన కొత్తరకం కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని 30 కి పైగా దేశాల్లో ఈ కొత్త స్ట్రెయిన్ కనుగొన్నారు వైద్యులు. తాజాగా చైనాలో కూడా ఈ మహమ్మారి అడుగు పెట్టినట్లు తెలుస్తుంది. బ్రిటన్ నుంచి బీజింగ్ వచ్చిన ఓ వ్యక్తిలో న్యూ స్ట్రెయిన్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఇది ఇలా ఉంటే భారత్ లో న్యూ స్ట్రెయిన్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.

గురువారం ఐదుగురు కొత్త కేసులను వైద్యులు గుర్తించారు. గురువారానికి న్యూ స్ట్రెయిన్ వైరస్ సోకినవారి సంఖ్య 25 కి చేరింది. వీరిలో ఢిల్లీకి చెందిన వారే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీలో పరీక్షించిన నమూనాలలో నలుగురు వ్యక్తులకు, అదేవిధంగా ఢిల్లీలోని ఐజిఐబీలో పరీక్షించిన నమూనాలలో ఒకరికి కరోనా స్ట్రెయిన్ లక్షణాలు ఉన్నట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యందర్ జైన్ తెలిపారు. అదేసమయంలో యూకే నుంచి అన్ని విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఆయన వివరించారు.

కరోనా న్యూ స్ట్రెయిన్ వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొన్ని రాష్ట్రాల్లో న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేశారు. హైదరాబాద్ లో మాత్రం న్యూ ఇయర్ వేడుకలకు అన్ని అనుమతులు ఇచ్చారు. మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 గంటల వరకు ఉండొచ్చని అనుమతించారు. ఇక పబ్ లకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చారు. హైదరాబాద్ లో కూడా కరోనా స్ట్రెయిన్ వస్తున్నప్పటికీ ప్రభుత్వం న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఇచ్చింది.

ఇక మరో వైపు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 200 చెకింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

 

దేశంలో 25 కు చేరిన కొత్తరకం కరోనా బాధితులు