కేటీఆర్ కాబోయే సీఎం : డిప్యూటీ స్పీకర్ పద్మారావు

324

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ను కాబోయే సీఎంగా సంబోధించారు. హైదరాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ ఆఫీసు ప్రారంభోత్సవంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.. అంతేకాదు శాసనసభ తరఫున, రైల్వే కార్మికుల తరఫున సీఎంగా ఎన్నికవబోతోన్న కేటీఆర్ కు శుభాకాంక్షలు అని అన్నారు..

కాగా పద్మారావు ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో మంత్రి కేటీఆర్ కూడా పక్కనే ఉన్నారు.. ఇదిలావుంటే గత కొద్దిరోజులుగా తెలంగాణకు నూతన సీఎం కేటీఆర్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ కూడా కేటీఆర్ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు.. తాజాగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.