ట్రాక్టర్ ర్యాలీ : నటుడు దీప్ సిద్ధు, ఇతర నిందితుల సమాచారం ఇస్తే నగదు బహుమతి..

85

జనవరి 26న ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా జరిగిన హింస కేసులో ఢిల్లీ పోలీసులు బుధవారం పెద్ద ప్రకటన చేశారు. దీప్ సిద్దూ (పంజాబీ నటుడు), ఇతర నిందితులు జుగ్రాజ్ సింగ్, గుర్జుంత్ సింగ్
ల గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ .1 లక్ష రివార్డ్ ఇస్తామని వెల్లడించారు.

అలాగే జజ్‌బీర్ సింగ్, బుటా సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ ల సమాచారం ఇచ్చిన వారికి కూడా రూ .50 వేల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు. వీరంతా రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వద్ద హింసాకాండకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. కాగా పోలీసులు మంగళవారం 12 మంది అనుమానిత ఫోటోలను కూడా విడుదల చేశారు.