Delhi : కేంద్రం ప్రతిపాదనలను తిరస్కరించిన రైతు సంఘాలు

129
Delhi: Farmers' unions reject union govt proposals

వ్యవసాయ చట్టాల్లో సవరణ ప్రతిపాదనలను రైతు సంఘాలకు పంపింది కేంద్ర ప్రభుత్వం. అయితే రైతు సంఘాలు ఈ ప్రతిపాదనలను తిరస్కరించాయి. కాసేపట్లో భవిశ్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఎపిఎంసీలకు అనుగుణంగా ప్రభుత్వ మార్కెట్లను బలోపేతం చేసేలా చట్టాల్లో సవరణ చేస్తామని కేంద్రం రైతులకు తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని వెల్లడించారు రైతులు. సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశంలో తమ అభిప్రాయాలు చెబుతామని తెలిపారు.