ఢిల్లీ ఉద్రిక్తతలపై హోంశాఖ అత్యవసర సమావేశం

132

ఢిల్లీలో రైతుల ర్యాలీ హింసకు దారితీసింది. ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో పోలీసులు అధికంగా ఉన్నారు. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ అత్యవసరంగా సమావేశమైంది. హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో హోంశాఖ, నిఘా విభాగ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అదనపు బలగాలను మోహరించారు. బలగాలను పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

రైతులు కర్రలతో పోలీసులపై దాడి చేయడంతో పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఇన్ని రోజులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్ పారిపోయినట్లు తెలుస్తుంది. ఊహించని ఈ పరిణామంతో పోలీసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. రైతుల ముసుగులో ఉన్న సంఘ విద్రోహశక్తులను పసిగట్టలేక పోతున్నారు. సాయంత్రం ఐదు అవుతున్న రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలోనే భీష్మించుకు కూర్చున్నారు.

పరిస్థితి ఇదే విధంగా ఉంటే ఢిల్లీ వరకు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం కనిపిస్తుంది. భారీ సెక్యూరిటీని చెందించి రైతులు ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండా ఎగరేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైతులు రైతు చట్టాలపై కాకుండా ఖలిస్థాన్ కొసం పోరాడుతున్నట్లు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీ ఉద్రిక్తతలపై హోంశాఖ అత్యవసర సమావేశం