Delhi bomb blast : ఢిల్లీ పేలుళ్లు తమ పనే

291

బాంబుల చప్పుళ్ళు, తుపాకుల మోతలు లేకుండా దేశం ప్రశాంతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఎవరికీ ఏమి కాకపోయిన దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇజ్రాయిల్ రాయబారకార్యాలయానికి చెరువులో ఐఈడీ పేలింది. దింతో అప్రమత్తమైన అధికారులు ఆ ప్రతాన్ని చుట్టుముట్టారు. ఈ పేలుడు వెనుక ఇరాన్ అస్తం ఉదని ఇజ్రాయిల్ భావించారు. అయితే ఈ పేలుడుకి పాల్పడింది తామే అని జైష్ ఉల్ హింద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

కేంద్ర దర్యాప్తు సంస్థలు ఓ టెలిగ్రామ్ చాట్‌లో ఈ విషయాన్ని గుర్తించాయి. ఓ అనుమానిత చానల్‌లో ఈ ఉగ్రవాద సంస్థ పేర్కొన్న ఈ వివరాలను గుర్తించాయి. ఈ పేలుడు తమకు గర్వకారణమని ఈ సంస్థ ప్రకటించినట్లు గమనించాయి. ఇక పేలుడుకు సమీపంలో ఓ సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్లుగా కనుగొన్నారు అధికారులు. దానిని పరిశీలించే ప్రయత్నం చెయ్యగా అందులో విసుఅల్స్ సరిగా నమోదు కాలేదని తెలుస్తుంది.

ఇక పేలుడు జరిగిన ప్రాంతాల్లో పింక్ కలర్ లో ఓ సీల్డ్ కవర్ ను అధికారులు గుర్తించారు. అందులో ఓ లేఖ ఉండటంతో దాన్ని స్వాధీనం చేస్తున్నారు. అయితే ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుండి అంటూ ఆ లేఖలో ఉగ్రవాదులు పేర్కొన్నట్లుగా సమాచారం. ఇక బాంబు పేలుడుతో కేంద్ర నిఘా వ్యవస్థ అప్రమత్తమైంది. మరోవైపు ఈ ఘటనపై NIA అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. CISF బందోబస్తు నిర్వహిస్తున్న ఈ ప్రాంతంలో బాంబు పేలుడు జరగడంతో దేశ వ్యాప్తంగా ఉన్న కంపనీల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

Delhi bomb blast : ఢిల్లీ పేలుళ్లు తమ పనే