Delhi bomb blast : ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్

331

Delhi bomb blast : ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ పేలింది. సాయంత్రం 5 గంటల 45 నిమిషాల ప్రాంతంలో ఇజ్రాయిల్ రాయబార కార్యాలయనికి 150 మీటర్ల దూరంలో ఫుట్ పాత్ పై ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. మూడు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు రాయబార కార్యాలయం వద్దకు చేరుకొని తనిఖీలు చేపట్టారు. Nia అధికారులు పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే ఈ ఐఈడీ ఎవరిని టార్గెట్ చేస్తూ పెట్టారనే విషయం తెలియరాలేదు.

ఇక అన్ని ప్రధాన కార్యాలయాలకు బాంబ్ పేలిన చోటు సమీపంలోనే ఉంది. బాంబ్ బ్లాస్ట్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతాన్ని మొత్తం బాంబ్ స్క్వాడ్ జల్లెడ పడుతుంది. మరోవైపు వైపు విజయ్ చౌక్ దగ్గర బీటింగ్ రీట్రీట్ జరుగుతున్న ప్రాంతానికి కేవలం 1.7 కిలోమీటర్ల దూరంలోనే బాంబు పేలుడు జరగటంతో పోలీసులతోపాటు భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఇక ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసింది. అత్యంత సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో ఎలా జరగడం పోలీస్ వ్యవస్థను వేలెత్తి చూపినట్లు అయింది.

 

 

Delhi bomb blast : ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్